కొత్తగూడెంలో ఒక విధానం, రామగుండంలో మరో విధానమా?
ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళలు మార్చి, మజ్జిగ ప్యాకెట్లు, చల్లటి త్రాగునీరు అందించాలి
PSCWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా కాంట్రాక్టు కార్మికుల పని వేళలు మార్చడంలో అధికారులు వివక్షను చూపించడం సరికాదని, అలాగే వారికి ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, తాగేందుకు చల్లటి మంచినీళ్లు అందించే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ విమర్శించారు. సివిక్ కాంటాక్ట్ కార్మికులు అధికారుల, పర్మినెంట్ కార్మికుల కాలనీలను నిత్యం శుభ్రం చేయడంలో కీలక పాత్ర వ్యవహరిస్తున్న, ఆ కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్యాలను కాపాడడంలో మాత్రం అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సబబు.
కార్మికులు ఈ ఎండల వల్ల శరీరాలు డిహైడ్రేషన్ బారిన పడుతూ, కండ్లు తిరగడం, వాంతులు చేసుకోవడం లాంటి పరిస్థితులు కూడా కార్మికులు ఎదుర్కొంటున్నారు. కొత్తగూడెంలో గత మూడు రోజుల నుండి కార్మికుల పని వేళలు మార్చి కాంట్రాక్టు కార్మికులకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను అందిస్తున్నప్పటికీ రామగుండం రీజియన్లో మాత్రం అధికారులు అమలు చేయడంలో వివక్షను చూపిస్తున్నారు. అధికారులకు ఇప్పటికే టి యు సి ఐ గా అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది.
కొత్తగూడెంలో అమలు చేసినప్పుడు ఇక్కడి అధికారులు ఎందుకు అమలు చేయడం లేదు. ఏరియాకు ఒకలాగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. వెంటనే అధికారులు స్పందించి సివిక్ ఇతర విభాగాల కాంట్రాక్టు కార్మికుల పని వేళలు మార్చి, కాంట్రాక్టు కార్మికులందరికీ ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను , పని స్థలాలలో త్రాగడానికి చల్లని మంచినీటిని సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ టియుసిఐ గా డిమాండ్ చేస్తున్నాం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


