గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త మరియు నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామగుండంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘనంగా నివాళులర్పించడమేకాక, ఆయన స్ఫూర్తిదాయక సేవలను గుర్తుచేసుకుంటూ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో రామగుండ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరై, మహాత్మా పూలే సిద్ధాంతాలు, సమానత్వం కోసం ఆయన పోరాటాన్ని వివరించారు. సమాజంలోని అంతర్యాళ్ళను తొలగించి విద్య, స్త్రీశిక్షణ, మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అనంతమైనదని తెలిపారు పూలే సేవలను భావితరాలకు చాటిచెప్పే విధంగా, కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, యువత, సంఘసభ్యులు కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సమానత్వ సమాజ నిర్మాణం పట్ల తమ కట్టుబాటును వ్యక్తం చేశారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని విగ్రహానికి పూలమాల వేసి, మహాత్ముని సేవలను స్మరించుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


