Good Governance : ఎక్కడ బాధలుంటే అక్కడ నేనున్నా” సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో దొన్నుదొర

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా డుంబ్రిగుడ, త్రినేత్రంన్యూస్ జూలై 26 : ఎడతెరిపిలేని వర్షాల మధ్య అరకు నియోజకవర్గంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం కొనసాగుతోంది. శనివారం డుంబ్రిగుడ మండలం అర్మ పంచాయతీ బడిమేల గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వర్షంలోనే గ్రామంలోకి చేరుకున్న దొన్ను దొర సిసి రోడ్లు లేక ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా పరిశీలించారు.
ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల అమలును సమీక్షించిన ఆయన, తాగునీరు, డ్రైనేజీ, రహదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కిల్లో ఆనంద్ రావు, పాంగి సుబ్బారావు, కొర్ర నాగరాజు, తాంగుల కోగేశ్వరరావు, పెట్టెలి బాలు, వంతల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

"Where there is suffering

You cannot copy content of this page

Scroll to Top