Orsu Mutyalu : రోడ్డుకు మోక్షం ఎప్పుడో ?

TRINETHRAM NEWS

-ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతల మయంగా రోడ్డు.

  • ప్రజలు ఇబ్బందులు -పడుతున్న పట్టించుకోని అధికారులు.
  • బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు.

డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 08 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ వడ్డెర గూడెం లో రోడ్డు వేశారు కానీ బీటి వేయడం మరిచిపోయారు. రాకపోకులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు పాలకులు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మా గ్రామం దేవరకొండ నియోజకవర్గం లో ఉందా లేదా ఒకవేళ ఉన్నట్లయితే మా గ్రామ ప్రజల ఇబ్బందులు వారికి తెలియడం లేదా అని బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై వేసిన కంకర మొత్తం కొట్టుకొని పోయి గుంతల మయంగా తయారయిందని ఈ రోడ్డు గుండా ప్రజలు ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి వెంటనే బీటీ రోడ్డు వేయాలని గ్రామ ప్రజల తరపున గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

When will the road be saved?

You cannot copy content of this page

Scroll to Top