Groundbreaking Ceremony : ఈదమ్మ తల్లి మాంధాత దేవాలయ పునర్నిర్మాణ భూమి పూజ

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 08 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ గ్రామపంచాయతీ వడ్డెర గూడెంలో , వడ్డెరుల ఆరాధ్య దైవం ఈదమ్మ తల్లి ఆలయ పున : ప్రతిష్ట దేవాలయ పునర్నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం బుధవారం 08 -11-25 రోజు న ఘనంగా నిర్వహించారు.
నూతన ఆలయ నిర్మాణం చేసేందుకు గ్రామ ప్రజలందరూ ఐక్యంగా పనులు చేస్తున్నారు. గ్రామ పెద్దలు, ప్రజలు భక్తులు మహిళలు సహా కుటుంబసమేతంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. అందరూ అధికసంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు , మాజీ ఎంపీటీసీ ఓర్సు అంజయ్య. బత్తుల శీను. వెంకటయ్య. వెంకటేష్. లక్ష్మీనారాయణ. సత్తయ్య. ఇద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Groundbreaking ceremony for the reconstruction

You cannot copy content of this page

Scroll to Top