గుంతలమయంగా రోడ్డు
ప్రయాణికులకు, వాహనదారులకు ,రైతులకు తీవ్ర ఇబ్బందులు. ఓర్సు ముత్యాలు.బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు .
డిండి (గుండ్లపల్లి) నవంబర్ 20 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్కోల్ (వడ్డేరగూడెం) నుండి బ్రాహ్మణ పల్లి వరకు బీ టీ రోడ్డు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. కంకర పరిచారు డస్ట్ పోసి తారు వేయకుండా అలాగే వదిలేశారని , ఇటీవలకురిసిన భారీ వర్షాలకు కంకర తేలి రోడ్డు అంతా గుంతలుగా మారిందని, ఈ రోడ్డు గుండా ప్రయాణo చెయాలంటే ప్రజలు, వాహనదారులు , రైతులు , చాల అవస్థలు పడుతున్నారని తెలిపారు.
ప్రజలు ఓట్లప్పుడే నాయకులకు గుర్తుకు వస్తారా? మిగతా సమయాల్లో గుర్తుకు రారా? ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు , ప్రజాప్రతినిధులు చూస్తువుంటారా? అని ఆయన అన్నారు. దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు త్వరితగతిన బాగుచేసేవిందంగా చూడాలని ఓర్సు ముత్యాలు కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


