Sarpanch Kalluri Kishore : ప్రజా సేవకు , గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్రం :జనవరి 06: (త్రినేత్రం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం , ముత్యాలమ్మ పాడు గ్రామ సర్పంచ్ కల్లూరి కిషోర్ మాట్లాడుతూ వాళ్లకు ఎంత మెజార్టీ వచ్చిందో , ఎన్ని వార్డులు గెలిచారో చెప్పారు.

అదేవిధంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినందుకు ఆనందంగా ఉందని అన్నారు.. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, జిల్లా పరిధిలో కూడా పనిచేసేనని తెలిపారు.మా గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. నేను , ఉపసర్పంచ్ , గ్రామ వార్డులు అందరం కలిసి గ్రామ అభివృద్ధికి , ప్రజాసేవకు కృషి చేస్తామని సూచించారు..

ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కార దిశగా ముందుంటామని, ఎల్లవేళలా మా గ్రామ ప్రజలకు, అభివృద్ధికి ఇష్టంతో పనిచేస్తానని వివరించారు. అదేవిధంగా గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రజలందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అడ్వాన్సుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు కలిగి ఉండాలని, వాళ్లు చేసేవృత్తులలో సిరిసంపదలు కలగాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని, ఎటువంటి ఇభేదాలు లేకుండా, రాకుండా ,, నీతి, నిజాయితీ ధర్మం వైపు నిలబడాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, చెప్పడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will work for public service and village development

You cannot copy content of this page

Scroll to Top