Golden District : కృష్ణ జిల్లాను సువర్ణ జిల్లాగా మారుస్తాం

TRINETHRAM NEWS

తేదీ : 07/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ లో ఇంచార్జ్ మంత్రి వాసంశెట్టి. సుభాష్ , కొల్లు .రవీంద్ర నేతృత్వంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పామర్రు ఎమ్మెల్యే వర్ల .కుమార్ రాజా పెడన ఎమ్మెల్యే కాగిత. కృష్ణ ప్రసాద్ పాల్గొని వారి వారి నియోజకవర్గాలలో సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు, కాల్వలు , ఇతర ప్రధాన సమస్యలను, అదేవిధంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను , వివరించారు.
సమస్యలను పరిష్కరించడమే కాకుండా అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యేలా మంత్రులు సహకరించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
అమరావతి నిర్మాణానికి యన్ డి యే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా నలబై తొమ్మిది వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సుభాష్ వివరించారు. ప్రపంచంలో స్థాయి రాజధాని నిర్మాణంలో మనమందరం భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలపడం జరిగింది.

ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో బాలసుబ్రమణ్యం కమిషనర్ సింహాద్రి .మనోహర్, యన్ టి ఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి. శ్రీనివాసరావు , సీనియర్ టిడిపి నాయకులు పిన్నమనేని. బాబ్జి , జనసేన ఇంచార్జ్ బూరగడ్డ. శ్రీకాంత్ గుడివాడ టిడిపి అధ్యక్షులు డి. రాంబాబు రూరల్ మండల అధ్యక్షులు వి. మురళి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి, టిడిపి నాయకులు లింగం. ప్రసాద్ , చేకూరు జగన్ మోహన్ రావు , పలువురు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Krishna district into a golden

You cannot copy content of this page

Scroll to Top