VC Acharya S. Prasannasri : ప్రకృతి ఒడి గా నన్నయను తీర్చిదిద్దుతాం

TRINETHRAM NEWS

వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ

రాజానగరం: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతామని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ అన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్.వి. శివరామ ప్రసాద్, డీన్ ఇన్చార్జ్ ఆఫీసర్ ఆచార్య బి. జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాలు గుర్తించి అరుదైన మొక్కలను నాటాలని, బొటనికల్ గార్డెన్ ను అభివృద్ధి చేయాలని పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో వృక్షాలు పెంచడం ద్వారా అందమైన, ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం లభిస్తుందన్నారు. ఆ వృక్షాలు పక్షులకు ఆశ్రయమవుతాయని, మనకు నీడను అవసరమైన ఆక్సిజన్ ను అందిస్తాయని అన్నారు.

నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణం అంతా రాతి నేల అని విస్తారమైన వేడితో ఉంటుందని, కాబట్టి ఈ ప్రాంతంలో విస్తారమైన మొక్కలు నాటి, చెట్లను సంరక్షించాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. నన్నయ విశ్వవిద్యాలయాన్ని అరుదైన మొక్కలు, చెట్లతో జీవవైవిద్యానికి నెలవుగా, ప్రకృతి ఒడిగా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్.వి. శివరామ ప్రసాద్ మాట్లాడుతూ వీసీ ఆహ్వానం మేరకు విశ్వవిద్యాలయాన్ని పరిశీలించామని, అటవీశాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అరుదైన మొక్కలతో బొటనికల్ గార్డెన్ ను ఏర్పాటు చేస్తామని, బోటనీ విద్యార్థులకు విద్య, పరిశోధనకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి ఏ ఏ ప్రాంగణంలో మొక్కలు అవసరమో గుర్తించి వాటి స్థానంలో మొక్కలు వేస్తామన్నారు. వీసీ సూచన మేరకు వర్షకాలం నాటికి విశ్వవిద్యాలయం ప్రకృతి ఒడిగా తీర్చిదిద్దుతామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will transform Nannaya

You cannot copy content of this page

Scroll to Top