Durga Prasad : జిల్లాలో బీజేపీని తిరుగులేని శక్తిలా బలోపేతం చేస్తాం

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 19 : భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా కార్యదర్శిగా నియమితులైన సీనియర్ నాయకులు కళ్యాణి దుర్గాప్రసాద్ నాయకులతో కలిసి మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎన్.శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో కొత్తగా పదవులు పొందిన నాయకులు మరింత బాధ్యతగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

అనంతరం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థల సభ్యులందరినీ కలుపుకుని ముందుకుసాగుతూ జిల్లాలో బీజేపీని తిరుగులేని శక్తిలా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రథమ కర్తవ్యంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు చెన్నమనేని స్రవంతి, మణిభూషణ్ చారి, పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BJP as an unstoppable force

You cannot copy content of this page

Scroll to Top