- మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,
- 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
- వైయస్‌ఆర్‌సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, గత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పేదల పక్షపాతగా ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలను తీసుకువస్తే… చంద్రబాబు వాటిని పీపీపీ విధానానికి మార్చి, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆక్షేపించారు.
అనపర్తి లో ఈరోజు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వై ఎస్ ఆర్ సి పి ప్రజా ఉద్యమం పోస్టర్ ని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆవిష్కరించారు.
ఈనెల 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు)(అనపర్తి మండల పార్టీ కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్), సబ్బెళ్ళ కృష్ణారెడ్డి (అనపర్తి మార్కెట్ మాజీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి), పోతుల ప్రసాద్ రెడ్డి(బుజ్జి) (బిక్కవోలు మండల పార్టీ కన్వీనర్), గుత్తుల వెంకటరమణ (పెదపూడి మండల పార్టీ కన్వీనర్), పేపకాయల వెంకటరమణ, కర్రి శ్రీ వెంకటరెడ్డి, కేత శ్రీనివాస్, నాగుమళ్ళ వీరభద్రరావు (వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి), అద్దంకి ముక్తేశ్వరరావు (రాష్ట్ర పార్టీ కార్యదర్శి(పార్లమెంట్)), వల్లభశెట్టి రామ సతీష్ (అనపర్తి నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు), వార కుమారి (అనపర్తి గ్రామ సర్పంచ్), నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణ రెడ్డి (రంగంపేట మండల వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్), కొండేటి భీమేశ్వర స్వామి (అనపర్తి నియోజవర్గం వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షులు, మరియు ఎంపీటీసీ సభ్యులు), సత్తి సూరా రెడ్డి (పొలమూరు గ్రామ ఉప సర్పంచ్), సత్తి కనకా రెడ్డి (పొలమూరు గ్రామ ఎంపీటీసీ సభ్యులు), గుడాల మాచర్రావు, సత్తి హరి ప్రసాద్ రెడ్డి, వీరభత్తుల చంద్రశేఖర్ తదితర వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


