మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగ్గిన గుణపాఠం చెప్పాలి.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం.
ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం.
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు. రమావత్ రవీంద్ర కుమార్. దేవరకొండ డివిజన్ అక్టోబర్ 8 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం గుడిపల్లి మండలం గణపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ లో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి అని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కెసిఆర్ హయాంలో ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచిగా మారాయని అన్నారు.
కెసిఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెలుగోరి వల్లపు రెడ్డి, మునగాల అంజిరెడ్డి, అర్వపల్లి నరసింహ, ఎర్ర యాదగిరి, సుధాకర్ గౌడ్, రాయిన బోయిన శీను, బీసీ విభాగం మండల అధ్యక్షులు బొడ్డుపల్లి మహేందర్ శ్రీను అశోక్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


