నూతన చైర్మన్ లు, మెంబర్లకు ఎమ్మెల్యే వేగుళ్ల నిర్దేశం…
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, చెల్లూరు, ఏడిద ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ లు గా నియమితులైన దేవళ్ళ వెంకటరావు, గొడవర్తి సత్యనారాయణ లు మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ని, మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ లు, మెంబర్లు గా నియమితులైన వారందరినీ ఎమ్మెల్యే వేగుళ్ల దుశ్శాలువాతో సత్కరించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సొసైటీల అభివృద్దికి కృషిచేయాలన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారికి మీయొక్క సహాయ సహకారాలు అందించాలన్నారు. చెల్లూరు పిఎసిఎస్ మెంబర్లు గా మేడిశెట్టి నాగేశ్వరరావు, తలాటం వెంకటేష్ లు, ఏడిద పిఎసిఎస్ మెంబర్లు గా ఇందుకూరి శ్రీనివాసరాజు, పైన సుబ్బయ్య లు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, రిమ్మలపూడి వేణుగోపాలదొర, చిరట్ల అప్పారావు, కాదా ప్రభాకరరావు, పర్వతిన వీర్రాజు, కొలుపోటి సత్యనారాయణమూర్తి, పెనుమత్స వెంకటవర్మ రాజు, పదం ఆనంద్, గుడాల కోటబాబు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


