డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 10 త్రినేత్రం న్యూస్. 10 అడుగుల మేర పూడిక, పాతికేళ్లలో రెండు పంటలకు గాను నిరంందించింది రెండుసార్లే. రోజు రోజు తగ్గిపోతున్న నీటి మట్టం. డిండి ప్రాజెక్టు నీటి మట్టం క్రమ క్రమంగా తగ్గుతుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 36 అడుగులు. ప్రస్తుతం 20 అడుగులకు చేరింది . గతేడాది ఆగస్టు లో ఎగువన కురి సిన భారీ వర్షాలకు రిజర్వాయర్ పూర్తి మట్టానికి చేరింది.
దీంతో వానాకాలం యసంగి పంటలకు నీరు అందింది. ప్రాజెక్టు లో 10 అడుగుల మేర పూడిక నిండి ఉంది. నాటి నిజాం ప్రభుత్వం 1940 లో పనులు ప్రారంభించగా 1943 లో పూర్తయింది.
ఈ ప్రాజెక్టు వర్శాధిరతము కావడంతో నిర్మించిన నాటినుండినీటితో పాటు బురద వచ్చి చేరి 10 అడుగుల మేర పూడిక తో నిండి వుంది. ప్రారంభంలో నీరు రెండు పంటలకు సాగు నీరు అందించిన పాజెక్టు నేడు పూడికంతో నిండి పోవడంవలన నేడుఒక్క పంతకే నీరు అందించే పరిస్థితి నెలకొని వుంది.
దీంతో ప్రాజెక్టు నిల్వ పెంచేందుకు 1996 లో స్పిల్ వే ను ఎత్తు 3 ఫీట్లకు పెంచారు అయినా సరే గతంలో మాదిరిగా 2 పంటలకు నీరు అందడం లేదనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిండి ప్రాజెక్టు నిర్మించిన ప్రారంభంలో. 2 పంటలకు నీరు అందేది కాల క్రమేణా ఎగువ నుండి నీరు రాక పోవడం తో నాలుగు ఐదు ఎండ్లకు ఒకసారి ప్రాజెక్టు లోకి నీరు వచ్చి నిండేది. 2000 సం,, నుండి నేటి వరకు పాతికెళ్లలో(,2025) 2021,22, 24,25లో మాత్రమే రెండు పంటలకు నీరు అందించారు.
డిండి ప్రాజెక్టు పరిధిలో 12500 ఎకరాల ఆయకట్టుఉంది. నాలుగైదు ఏండ్లుగా కల్వకుర్తి ఎత్తిపోతల నుండి నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకునివుంది. నీటి లభ్యత పెరగటంతో సాగు విస్తీర్ణంపెరిగి. ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది డిండి ప్రాజెక్టు ఆధారంగా 150 మత్స్య కార కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి.
సంబంధిత అధికారులు స్పందించి ప్రాజెక్టు లో పూడిక తీత పనులు ప్రారంభించి నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని రెండు పంటలకు సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని మండల మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


