WhatsApp Image 2024 08 18 at 15.43.33
Vriksha Bandhan celebrations under the auspices of Telangana Mahila Mitra
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
స్థానిక ఎన్టీపీసీ, అన్నపూర్ణ కాలనీలో తెలంగాణ మహిళా మిత్ర స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ గంగపుత్ర ఆధ్వర్యంలో వృక్షాబందన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మహిళా మిత్ర సభ్యురాల్లు వృక్షానికి రక్షా బందన్ కట్టారు.అనంతరం మాట్లాడుతూ వృక్షాలు మానవ మనుగడకు రక్షణగా అనాదిగా నిలుస్తున్నాయని, వృక్షాలను మనందరం కాపాడితే అవి మనుషులకు, పర్యావరణానికి, జీవకోటి అంతటికి రక్షణగా ఉంటాయని, మనందరం చెట్లను, వృక్షాలను రక్షించుకోవాలని, అందుకోసమే వృక్షాలకు రక్షబందనం కట్టి వృక్షాబందన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని” అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా మిత్ర అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ గంగపుత్ర, మేడగోని స్వప్న గౌడ్, శ్యామల, జక్కెన శ్రీలత, గోలివాడ సరిత గంగపుత్ర, నసీమా, అక్తర్ పాషా తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
