మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ డివిజన్ జనవరి 28 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో దేవరకొండ మున్సిపాలిటీ 5వ వార్డుకి చెందిన జక్కుల రాజేశ్వరి తోపాటు యాభై కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు…
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ…..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి, సంక్షేమం కుంటునపడ్డాయి అని ఆయన తెలిపారు. మార్పు మార్పు అంటూ నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన దరిద్రపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ మోసాలకు బలైపోయామని ఇప్పుడు ప్రజలందరూ బాధపడుతున్నారు అని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలను ఇవ్వకపోవడమే గాక ఉన్న పథకాలను రద్దు చేసి పేదోల్ల పొట్టకొడుతుంది అని ఆయన తెలిపారు.ముందు చూపుతో బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది అని,బాలింతలకు ఆసరా ఇచ్చిన కెసిఆర్ కిట్ పథకాన్ని పూర్తిగా ఆపేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు.దేశంలో గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెట్టిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని ఆయన తెలిపారు.
చదువుకున్న విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాకా దాని ఊసేలేకుండాచేశారు, తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బతుకమ్మ పండుగకి కెసిఆర్ అందించిన బతుకమ్మ చీరలనుపేరుమార్చి ఇందిరమ్మ చీరలంటూ ఎన్నికల సమయంలో పంపిణీ చేస్తున్నారు.ఆడబిడ్డల, రైతన్నల శాపనార్థాలు ఈ రాష్ట్రానికి మంచిది కాదు అని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు ప్రజలకు భద్రత లేదు, రక్షణ లేదు అని ఆయన అన్నారు.ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నాయకులు మీ ఇంటి చుట్టూచక్కర్లుకొడుతున్నారు.వారికి ఎన్నికలలో ఓట్లు సీట్లు తప్పా మన పేదప్రజల కష్టాలు, బాధలు పట్టవు అని ఆయన అన్నారు.
ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ దేవరకొండ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ పాల్వాయి స్రవంతి,బీల్యానాయక్, నేనావ కిషనాయక్,గాజులఆంజనేయులు,బోయపల్లిశ్రీనివాస్ గౌడ్,వేములరాజు,బొడ్డుపల్లి కృష్ణ,రమావత్ తులసిరాం ,విరమోని అంజి గౌడ్, కేతావత్ రమేష్, పల్లా లోహిత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


