Pachipenta Shantakumari : అరకు ఉత్సవాలు వెలుగుల్లో గిరిజనుల జీవితాలు చీకట్లో

TRINETHRAM NEWS

అరకులోయ జనవరి 29, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహిస్తున్న చలి ఉత్సవాలు గిరిజనులకు ఏం ఉపయోగమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ప్రశ్నించారు. శాంత కుమారి మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ నిర్వహిస్తున్న ఈ సంబరాలు గిరిజన రైతులకు, యువతకు ఏమాత్రం లాభం చేకూర్చలేదని ఆమె విమర్శించారు.
ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలు నేటికీ అమలుకాకుండా ఫైళ్లకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రచారం చేసిన వాగ్దానాలు ప్రచారానికే పరిమితమయ్యాయా? అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి అరకు పర్యటన సందర్భంగా భూమి, ఉద్యోగాలు, హక్కులు వంటి కీలక అంశాలను కూటమి గిరిజన నాయకులు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు బాధ్యతగా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. జీఓ నెంబర్ 3 కు చట్టబద్ధత కల్పించి గిరిజన యువతకు 100 శాతం ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన జీఓలను తక్షణమే రద్దు చేయాలని, కాఫీ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
గిరిజనుల పట్ల చిత్తశుద్ధి మాటల్లో కాదు, చర్యల్లో కనిపించాలని, లేనిపక్షంలో గిరిజనుల పోరాటాలు తప్పవని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Araku Festivals in the Light, Tribal Lives in the Dark

You cannot copy content of this page

Scroll to Top