అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

TRINETHRAM NEWS

అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు.

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం పాత నాగిరెడ్డిపల్లి గ్రామం కు చెందిన దానబోయిన వెంకట్రావు , దానబోయిన శ్రీరామమూర్తి వారి రెండు నివాసాలు అగ్ని ప్రమాదం కు గురై పూర్తి స్థాయిలో ధగ్నం కాగా, విషయం తెలుకున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఘటన స్థలాన్ని పరిశీలించి, భాధిత కుటుంబానికి భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సంఘటన జరగటం దురదృష్టకరమని, అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణ హాని జరగలేదని అన్నారు. పూర్తి గా ఇళ్లు కాలిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి గ్రామ నాయకులతో పాటు మేము కూడా అండగా ఉంటామని హామీ. అలాగే తక్షణ సహాయం గా లక్ష రూపాయల ఆర్థిక సాయం ను బాధిత కుటుంబాలను శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి చేతుల మీదుగా అందజేశారు. అలాగే ప్రభుత్వం తరపున వారికి ఇళ్లు కట్టించేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు మరలా పునరావృత్తం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారితో పాటు గా నియోజకవర్గ, మండల స్థాయి నాయకుల తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top