ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్.
దేవరకొండ డివిజన్ నవంబర్ 17 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ ఆంజనేయ వెటర్నరీ మెడికల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. షాప్ యజమాని పచ్చిపాల శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం మేరకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్థక రంగం రైతుల జీవనోపాధికి కీలకమని, పశువుల ఆరోగ్య సంరక్షణలో మెడికల్ షాపులు, వెటర్నరీ సేవలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. పశుపోషక కుటుంబాలకు శీఘ్రం, సమర్థవంతమైన ఔషధాలు, పర్యవేక్షణ, మార్గదర్శకత్వం అందించడంలో ఇలాంటి మెడికల్ షాపులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. స్థానిక ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించాలని, పశుసంపద అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని యాజమాన్యాన్ని కోరారు.
ఈ సందర్భంగా ప్రొప్రైటర్ పచ్చిపాల శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే బాలునాయక్ ని శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


