దేవరకొండ డివిజన్ అక్టోబర్ 24 త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిల్కమర్రి స్టేజి శివ గణేష్ కాటన్ మిల్లు వద్ద సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎం ఎల్ ఏ బాలు నాయక్ ప్రారంభించారు . ఈసందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రానికి తేమతక్కువఉండి,చెత్తాచెదారం లేని నాణ్యతగల పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు.
రైతులు దళారులకు పత్తిని విక్రయించి మోసపోవద్దని తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, పత్తి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.8110 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


