జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 29 at 16.21.18

TRINETHRAM NEWS

వెంగల తిరుమల ఆఖరి మజిలీ యాత్ర సహాయం చేసిన, సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ఇందిరమ్మ కాలనికి చెందిన 40 సంవత్సరాల వెంగల తిరుమల మంగళవారం ఉదయం బ్రెన్ స్టోక్ రావడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి వరంగల్ ఎంజీఎం కు తరలించవలసిందిగా వైద్యులు చూసించగా వెంటనే కుటుంబ సభ్యులు వరగంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో చేరిపించగా వైద్యం తీసుకుంటూ మంగళవారం సాయంత్రం తిరుమల మరణించినట్లు కుటుంబ సబ్యుల ద్వారా తెలిసింది తిరుమల అంతక్రియలు బుధవారం జరుగనుండగా సహాయం కోసం సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించిన మల్లేష్ ఫౌండేషన్ సభ్యులు చింతల భాస్కర్ రావు సహకారంతో పాడే కు సంబంధించిన సామానులు మృతురాలి ఇంటి వద్దకు పంపినట్లు అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ మృతి చెందిన తిరుమల పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మల్లేష్ అన్నారు, తిరుమల టిపిన్ సెంటర్ లో పని చేస్తూ ఇద్దరు పిల్లలతో ఇందిరమ్మ కాలనిలో నివాసం ఉండే వారని అందరితో ఆప్యాయతగా ఉండే వారని ఈ సందర్భంగా మల్లేష్ గుర్తు చేశారు,ఫౌండేషన్ సభ్యులు చింతల భాస్కర్ రావు తిరుమల పరిస్థితిని తెల్పగానే సహాయం అందించడానికి ముందుకు వచ్చారని భాస్కర్ రావు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సబ్యులుగా ఉండి ఇప్పటి వరకు చాలా మంది నిరుపేదల అంతిమ యాత్రలకు సహాయం అందజేశారని వీరి యొక్క దాతృత్వానికి బాధితుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ తెలిపారు,ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page