వనితమ్మ.. మీ వెంటే మేమంతా

TRINETHRAM NEWS

Trinethram News : తూర్పు గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని వివిధ గ్రామాల శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు, పెద్ద ఎత్తున యువత పదుల సంఖ్యలో కార్లలో ర్యాలీగా బయలుదేరి శుక్రవారం రాత్రి యర్నగూడెం క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా వనితమ్మను భారీ మెజార్టీతో గెలిపించడానికి తామంతా సిద్ధమని హోం మంత్రికి వివరించారు. వనితమ్మ వెంటే తామంతా నడుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సభ్యులంతా కలిసి మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, పలు అంశాలను హోంమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సత్వరమే చక్కదిద్దే దిశగా హోంమంత్రి పలు పరిష్కార మార్గాలను సూచించారు. నియోజవర్గంలోని ప్రతి నాయకునికి కార్యకర్తలు ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఏ సమయంలోనైనా తనతో మాట్లాడవచ్చని హోంమంత్రి భరోసా ఇచ్చారు. వందల సంఖ్యలో నాయకులంతా కలసి తమకు సంఘీభావం తెలపడం పట్ల సంఘం వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం యాదవ సంఘ నాయకులంతా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ విజయానికి అంతా ఐక్యతగా పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండల స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు: హోం మంత్రి వారి క్యాంపు కార్యాలయం, యర్నగూడెం

You cannot copy content of this page

Scroll to Top