అల్లూరిజిల్లా కురూపాం నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 6 : ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించిన జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్, ఆవిర్భావ సభ పార్లమెంట్ సమన్వయ కర్త, సాంస్కృతిక విభాగం కమిటీ సభ్యులు వంపూరు గంగులయ్య. జనసేన పార్టీ 12,వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేద్దాం..కురుపాం నియోజకవర్గం ఇంచార్జ్ కడ్రక మల్లేశ్వరరావు,జనసేన పార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చిన జనసేన పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్ నిమ్మల నిబ్రం, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్తిబాబు, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి జాని.
కురుపాం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జనసేన పార్టీ నేత ,వంపూరు గంగులయ్య అద్యక్షతన ముఖ్యనాయకులు సమావేశం అయ్యారు… ఈ సందర్భంగా వంపూరు గంగులయ్య మాట్లాడుతూ మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12,వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని, జనసేన పార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి, పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చెయ్యాలని కోరారు.పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు నియోజకవర్గంలోని, అన్ని మండలాల నాయకులు , సభకు తరలి వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు… జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు వీరమహిళలు అందరూ, క్రమశిక్షణతో కలిసికట్టుగా, పండుగల జరుపుకుందామని, దిశానిర్దేశం చేశారు… అనంతరం పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


