Irugadindla Krishna : వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి

TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తాం

ఇన్చార్జి ఇరుగడిండ్ల కృష్ణ.

దేవరకొండ డివిజన్ మార్చ్ 09, త్రినేత్రం న్యూస్. తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కుల అభివృద్ధికి 1000 కోట్ల నిధులు కేటాయించేలా చూడాలని వినతి పత్రం అందజేసిన దేవరకొండ నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షుడు ఇరగదిండ్ల కృష్ణ

తధనంతరం ఇరగదిండ్ల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ వడ్డెర కుల అభ్యున్నత కోసం వడ్డెర కులాన్ని (బీ సీ)జాబితా నుండి తొలగించి(ఎస్ టీ)జాబితాలో చేరుస్తామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వడ్డెర సంఘం బహిరంగ సభలో ప్రకటించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలో వడ్డెర కులాన్ని (ఎస్ టీ)లో చేర్చాలని కేంద్రానికి లేఖ రాశారు.స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వడ్డెర కులాన్ని (ఎస్ టీ)లో చేర్చాలని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కి బహిరంగ లేఖ రాశారు.2018లో మెదక్ జిల్లా ముత్తంగి వడ్డెర సంఘం బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వడ్డెర కులాన్ని (ఎస్ టీ)లో చేర్చుటకు అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తానని వడ్డెర కులానికి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తానని బహిరంగ సభలో ప్రకటించారు.

జూడో యాత్రలో భాగంగా గౌరవ రాహుల్ గాంధీ అనేక బహిరంగ సభలో వడ్డెర కులాన్ని ( ఎస్ టీ)జాబితాలో చేరు స్తామని ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టో 31వ పేజీ 5వ లైన్ లో వడ్డెర కులానికి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పొందపరిచారు.స్వరాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డెర్లను ఏనాడు పట్టించుకోలేదని.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు కానీ మా వడ్డెర్ల ఓట్లను వేయించుకొని ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడ్డెర్లను మర్చిపోయి వడ్డెర్లకు ఇచ్చిన హామీలు మర్చిపోయారు.ప్రభుత్వం ఏర్పడి 27నెలలు గడుస్తున్న వడ్డెర్ల అభ్యున్నత గురించి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో వడ్డెర్ల గురించి ప్రస్తావించి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించి మరియు వడ్డెర కులాన్ని (ఎస్ టీ)జాబితాలో చేర్చుటకు అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపాలి..
రాష్ట్ర ప్రభుత్వం స్పందించని ఎడల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడ్డెర్లందర్నీ కూడగట్టుకొని అసెంబ్లీ ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.
ఈకార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి ఇరగదిండ్ల వెంకటేష్ నేరేడుగొమ్ము మండల అధ్యక్షులు ఇరగదిండ్ల రాముడు అశోక్ వరికుప్పల రాముడు ఓర్సు బిక్షపతి వేముల గోవిందు వివేముల వెంకట్ రాములు వివిధ మండలాల వడ్డెర నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vaddera Corporation should be formed

You cannot copy content of this page

Scroll to Top