రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ ఎ సి)జె. అరుణ శ్రీ
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. లోక కళ్యాణ్ మేళా లో భాగంగా శుక్రవారం మెప్మా ఆద్వర్యంలో వీధి వ్యాపారులకు డిజిటల్ లావా దేవీల నిమిత్తం పోస్ట్ ఆఫీస్ క్యూ ఆర్ కోడ్ స్కానర్ లను ప్రదానం చేశారు. ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ ఖాతా లావా దేవీలతో క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కూడా వీధి వ్యాపారులు పొందవచ్చని అన్నారు. పి ఎం విశ్వ కర్మ, పి ఎం స్వనిధి , పి ఎం జె బి వై తదితర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందడానికి పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉపయోగపడుతుందని అన్నారు. పోస్టల్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ ఖాతా తో దేశం లోని ఏ పోస్ట్ ఆఫీస్ కు వెళ్లయినా వేలిముద్ర ఆదారంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చని అన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఓ టి పి లు ఇతరులకు షేర్ చేయవద్దని , ఎ పి కె లింక్ ఫైల్స్ తెరవ కూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ మౌనిక , సి ఓ లు శ్వేత , ఊర్మిళ , శమంత , ప్రియ దర్శిని , పోస్టల్ అధికారి భావన పలువురు వీధి వ్యాపారులు పాల్గొన్నారు.
2. స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో శుక్రవారం సంజయ్ గాంధీ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద పరిశుభ్రం చేశారు. ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి మాట్లాడుతూ స్వచ్చ భారత్ విజన్ తో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే సంస్కృతి , క్రమ శిక్షణ అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్,వార్డు అధికారి సాయి , ఎకో వారియర్స్ ప్రతినిధులు శివ కృష్ణ , కరుణాకర్ , మహేందర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


