త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, మండలం ఊట్లపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో నాగుల్లంక సంబంధించిన బోనం గురిజి, సాక్షాత్తు ఆదిపరాశక్తి కథను ఆహ్లాదకరంగా, కళ్ళకు కనుల పండగలా గా చూపించినట్లు, తెలియజేశారు. అంతేకాకుండా ఈ కథలో అమ్మవారి కధ వెంకటేశ్వర స్వామి కథను మరిన్ని వేషాలతో చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించినట్లు తెలియజేశారు. కాలం ఎంత మట్టికి మారినప్పటికీ పద్ధతులు ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఉద్దేశంతో, ఆదిపరాశక్తి కథతో పాటు మరిన్ని కథలు చెప్పడం జరిగింది.
ఈ కథలో పాత్రలు, నారద మహర్షి, విష్ణుమూర్తి, పార్వతి దేవి, మరిన్ని సన్నివేశాలు వేసి ఆ ఊరి గ్రామ పెద్దలను, భవానీ లను ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఆ ఊరి సంబంధించిన చిన్నపిల్లలకి కూడా వేషధారణ ఇచ్చి పిల్లలను సంతోష పరచినట్లు ఆ ఊరి గ్రామస్తులు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మరికొందరు ఇలాంటి కథలు తెలుసుకోవడం వలన సాంప్రదాయాలు, అనేవి ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతాయని తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


