US attack on Iran : ఇరాన్‌ వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా దాడి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్‌ ద్వీపంపై దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. ఆ ద్వీపంలోని అన్ని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపామని చెప్పారు. పశ్చిమాసియా చరిత్రలోనే ఇది అత్యంత భారీ దాడుల్లో ఒకటని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే చమురు నిల్వలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలకు ఇరాన్‌ ఆటంకం కలిగిస్తే తమ నిర్ణయాన్ని వెంటనే మార్చుకుంటామని హెచ్చరించారు. తాము దాడి చేయాలని నిర్ణయిస్తే ఇరాన్‌ అడ్డుకోలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

US attack on Iran's strategic island

You cannot copy content of this page

Scroll to Top