త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 9: రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ మరియు నెల్లూరు లోక సభ సభ్యులు ,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ , ప్రత్యక్షంగా కలిసి, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యాలయంలో పూర్తిస్థాయి రైల్వే ఆసుపత్రి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ,ప్రతిపాదనను సానుకూలంగా అంగీకరించినట్లు వెల్లడించారు.
నెల్లూరు రైల్వే స్టేషన్ రోజుకు 22,000 మందికి పైగా ప్రయాణీకులను, 110 రైళ్లను నిర్వహిస్తున్న, ఇప్పటికే స్టేషన్ అభివృద్ధికి 102 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. అయినప్పటికీ, ఇంత పెద్ద జిల్లాకేంద్రంలో ఇప్పటికీ రైల్వే ఆసుపత్రి లేకపోవడం ఉద్యోగులు, పింఛన్‌దారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడేలా చేస్తోంది.
నెల్లూరులో 500 మంది రైల్వే ఉద్యోగులు, 850 మంది పింఛన్‌దారులు ఉండగా, నెల్లూరులో వెంటనే పూర్తి స్థాయి రైల్వే ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరం అత్యవసరం అని ఇద్దరు ఎంపీలు మంత్రి వివరించారు. ఈ విజ్ఞప్తిని మంత్రి అశ్విని వైష్ణవ్ , ఎంతో సానుకూలంగా తీసుకొని, నెల్లూరులో రైల్వే ఆసుపత్రి ఏర్పాటు ప్రతిపాదనను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ,బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ, రైల్వే ఉద్యోగులు పింఛన్‌దారులు తమ జీవితమంతా రైల్వే సేవకు అంకితం చేశారు. ఇప్పుడు వారికి అవసరమైన సమయంలో సమీపంలోనే వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలి. నెల్లూరులో రైల్వే ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర మంత్రి అంగీకరించడం చాలా సంతోషము అన్నారు. శ్బీద మస్తాన్ రావు యాదవ్ కార్యాలయం, నెల్లూరు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


