Kavali MLA Kavya Krishna Reddy : కావలి పట్టణంలో ఔషధ తనిఖీ అధికారి, నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 9: నెల్లూరు జిల్లా : కావలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔషధ తనిఖీ అధికారి (డ్రగ్ ఇన్స్పెక్టర్) కార్యాలయంను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రజలకు అంకితం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే , ఔషధ నియంత్రణ పరిపాలన అధికారులు, స్థానిక నాయకులు, వార్డు ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , కావలి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు చేరేందుకు, నకిలీ మందుల నియంత్రణకు, ఫార్మసీలపై పర్యవేక్షణ మరింత బలపడేందుకు ఈ కార్యాలయం పెద్ద సహాయం చేస్తుంది. ప్రజల ఆరోగ్య భద్రత మా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం, అని అన్నారు.
అధికారులు మాట్లాడుతూ కొత్త కార్యాలయం ద్వారా ఔషధాల నాణ్యత నియంత్రణ, ఫార్మసీల తనిఖీలు, లైసెన్సులు, ఫిర్యాదుల పరిష్కారం వేగంగా జరుగుతాయని తెలిపారు. కావలిలో ఆరోగ్య పరిపాలనకు కొత్త దిక్సూచిగా నిలిచే ఈ కార్యాలయ ప్రారంభోత్సవం ప్రజల్లో హర్షం వ్యక్తం చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kavali MLA Kavya Krishna Reddy who started the new office of drug inspection

You cannot copy content of this page

Scroll to Top