Unidentified Person Dies : గుర్తుతెలియని వ్యక్తి మృతి

TRINETHRAM NEWS
 డిండి ఎస్ఐ సిహెచ్ బాలకృష్ణ 

డిండి (గుండ్లపల్లి )జనవరి 31 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు పక్కన వున్న సాయిబాబా గుడి పక్కన కూర్చొని గుండె నొప్పి వస్తుందని అనగా అతన్ని గ్రామ ప్రజలు అక్కడ అందుబాటులో ఉన్న బాలు ఆర్ఎంపి డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళగా డాక్టర్ చెక్ చేస్తుండగా ఒకేసారి గుండె నొప్పి తో కింద పడి చనిపోగా అతని వివరాలు తెలుసుకోవడం వలన అతను 2 నెలలుగా రోడ్డు పక్కనే ఉంటూ షాప్ వాళ్లు పెట్టింది తిని ఉంటున్నాడు అని చూసిన వారు చెప్పినారు.

అతని ఎడమ చేయిపై శ్రీరామ్ అనీ హిందీ లో రాసి ఉన్నది దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అని ఎస్ ఐ బాలకృష్ణ తెలిపారు. ఇతని వివరాలు ఎవరికైనా తెలిస్తే డిండి పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

unidentified person dies

You cannot copy content of this page

Scroll to Top