One Town CI : వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో

TRINETHRAM NEWS

ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి,

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ మంగళవారం గోదావరిఖని చంద్రబాబు కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు, గోదావరిఖని కళ్యాణ్ నగర్ లోని. హాలీవుడ్ షూస్ నిర్వాహకులు షేక్ జాన్ మహమ్మద్, తాజ్ సహకారంతో వెలుగు సామాజిక స్వచ్ఛ ఆధ్వర్యంలో విద్యార్థులకు షూ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ హాజరై షూ పంపించేశారు. అనంతరం వారు మాట్లాడారు. హాలీవుడ్ షూ యాజమాన్యం సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షూలు సాక్స్ లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తమ పిల్లల్ని స్కూలుకు పంపించాలని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పిల్లలకు అవసరమయ్యే వాటిని అందిస్తామని సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. వెలుగు సామాజిక స్వచ్ఛ సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కిరణ్ కుమార్, అధ్యాపకులు రామలక్ష్మి, స్వప్న తో పాటు బొల్లం మధు, షేక్ జాన్ మహమ్మద్, టి అనిల్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Under the auspices of

You cannot copy content of this page

Scroll to Top