
ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ(ఆర్ టి ఐ )-2005 వ్యవస్థాపక&అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్.
Ugadi Greetings : దేవరకొండ డివిజన్ మార్చ్ 18, త్రినేత్రం న్యూస్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా సమాచార హక్కు చట్టం కార్యకర్తలకు శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజల జీవితాల్లో ఈ కొత్త ఏడాది సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే, ప్రజలందరి జీవితాలు సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, విజయపథంలో సాగాలని కోరారు.
ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యుడికి బలం చేకూర్చేందుకు కృషి చేస్తున్న కార్యకర్తలందరూ ఈ ఏడాది మరింత ఉత్సాహంతో, పారదర్శకమైన సమాజం కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, రైతాంగం పాడిపంటలతో విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

