అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

TRINETHRAM NEWS

Trinethram News : May 12, 2024,

అమెరికాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్‌ క్రీక్‌ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23), రోహిత్‌ మణికంఠ రేపాల (25) సహా 16 మంది స్నేహితులు ఈ నెల 8న జలపాతం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో రాకేశ్‌, రోహిత్‌లు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా జలపాతంలో మునిగిపోయారు.

You cannot copy content of this page

Scroll to Top