TRINETHRAM NEWS

Trinethram News : తిరుమలలోని పలు ప్రాంతాలు, కాటేజీల్లో శుభ్రత పెంచేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించి, వచ్చే ఫిర్యాదులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేయాలని తితిదే ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. భక్తులు తితిదే వసతి గదులు ఎన్ని గంటలకు ఖాళీ చేస్తున్నారు.. తిరిగి ఎన్ని గంటలకు గదులు కేటాయిస్తున్నారనే సమగ్ర సమాచారం తెలిసేలా యాప్ రూపొందించి గదుల కేటాయింపులో ఆలస్యం కాకుండా చూడాలన్నారు.

ఇందులో ప్రధానంగా తిరుమలలో భక్తులకు శీఘ్రదర్శనం, గదుల కేటాయింపు, శుభ్రత తదితర అంశాలపై చర్చించారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లలో అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీలో భక్తుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి సమగ్ర విశ్లేషణాత్మక నివేదిక రూపొందించాలన్నారు. లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద ఆలస్యం చేయకుండా లడ్డూల పంపిణీ జరగాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TTD Special app for