చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి…
త్రినేత్రం న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట ఏడిద రోడ్డు లో నిరుపయోగంగా ఉన్న ఏడిద రోడ్ బస్ కాంప్లెక్స్ ను ఉపయోగం లోకి తీసుకురావాలనీ మండపేట పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. మండపేట పురపాలక సంఘం సాధారణ కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఎక్స్ అఫిషియో సభ్యులు గా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి మాట్లాడుతూ మండపేట గుమ్మిలేరు రోడ్ లో అన్నపూర్ణ హైస్కూల్ వద్ద హైదరాబాద్ వెళ్ళే బస్సులు కోసం ప్రతి రోజూ వందలాది మంది ప్రయాణికులు వేచి చూస్తున్నారనీ పేర్కొన్నారు. అక్కడ కనీసం లైట్లు కూడా వెలగడం లేదని పేర్కొన్నారు. ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూర్చోవడానికి కూడా సౌకర్యాలు లేవన్నారు. అక్కడ ఒకేసారి రెండు మూడు బస్సులు రావడం తో ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు.
ఈ సమస్య కు పరిష్కారం గా ఈ బస్సులన్నీ బైపాస్ లో ఏడిద రోడ్ కాంప్లెక్స్ వద్ద కు వస్తె అక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్ళొచ్చన్నారు. కూర్చొనే వీలు ఉంటుందన్నారు. అక్కడే మరుగుదొడ్లు కూడా ఉన్నాయన్నారు. ఈ దిశగా ఆలోచన చేసి ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ లతో సమావేశం నిర్వహించి అక్కడ హైదరాబాద్, బెంగుళూరు బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.దీనిపై కమిషనర్ టీవీ రంగారావు మాట్లాడుతూ అది ఆర్టీసీ బస్ స్టాండ్ అని అక్కడ ప్రైవేటు బస్సులు నిలపడం నిబంధనలు ఒప్పుకోవాని చెప్పారు. మండపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణం లోని శివారు ప్రాంతాల్లో మూడు పబ్లిక్ టాయిలెట్ లు కొత్తగా నిర్మిస్తున్నామని కమీషనర్ చెప్పారు. పెద్ద కాల్వ వంతెన వద్ద, బైపాస్ రోడ్డు లారీ యూనియన్ ఆఫీస్ వద్ద రెండు టాయిలెట్ లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఆలమూరు రోడ్ గుమ్మిలేరు వైపు టోల్ గేట్ వద్ద మరో మరుగుదొడ్డు లు నిర్మిస్తామని అక్కడ షెల్టర్ లా ఓ గది నిర్మాణం చేసి అన్నపూర్ణ వద్ద నిలిచే బస్సులు అక్కడ నిలిపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


