
విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది సస్పెండ్
Trinethram News : Tirumala : వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు వ్యక్తులు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్‌పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది.
టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు.
సస్పెండ్ అయిన టీటీడీ సిబ్బంది: ఇద్దరు
చక్రపాణి (సీనియర్ అసిస్టెంట్)
వాసు (జూనియర్ అసిస్టెంట్)
సస్పెండ్ అయిన టీటీడీ భద్రతా సిబ్బంది – 5 మంది:
డి. బాలకృష్ణ, PSG: 0807
వసుమతి, CWPSG: 514067
టి. రాజేష్ కుమార్, AWPO: 512475
కె. వెంకటేష్, PSG: 932
ఎం. బాబు, AWPO
సస్పెన్షన్‌కు ప్రతిపాదించబడిన ఎస్పీఎఫ్ సిబ్బంది – 6 మంది:
- సి. రమణయ్య, ASI: 1101 (ఇన్‌ఛార్జ్)
- బి. నీలబాబు, CT: 3595
- డి.ఎస్.కె. ప్రసన్న, CT: 3602
- చ. సత్యనారాయణ, ASI: 696
- పోలి నాయుడు, CT: 3516
- ఎస్. శ్రీకాంత్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
