134th Jayanti Sabha : గుగ్గుడులో 134 వ జయంతి సభ – పొద్దు బాలదేవ్

TRINETHRAM NEWS

అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ రక్షణకై పోరాటం చేద్దాం

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 14: రాజ్యాంగ స్ఫూర్తితో లౌకిక,ప్రజాస్వామ్య రక్షణకై , ఆదివాసీ హక్కులు చట్టాలు అమలుకై పోరాటం చేయాలని అంబేద్కర్ 134 వ జయంతి పురస్కరించుకుని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో గుగ్గడు గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండల నాయకులు బస్కీ మాజీ ఎంపీటీసీ బురిడి దశరథ్ మాట్లాడుతూ భారత దేశం దశ దిశ నిర్దేశం చేసిన రాజ్యంగా నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు వుండాలని దేశం లో సమగ్ర అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారని కానీ 78 సంవత్సరాల స్వతంత్ర్య భారతంలో దళితులు,ఆదివాసులు ఇతర బలహీన వర్గాలు ఇంకా వెనకబడుతున్నాయని కేంద్రంలో బీజేపీ సర్కారు ప్రధానంగా ఆదివాసులకు అడవి నుండి గెంటివేస్తూ నూతన అటవీ సవరణ బిల్లును ఆమోదించింది అడవి మీద ఆదివాసులకు హక్కులు లేకుండా చేస్తున్నరని రాష్ట్ర ప్రభుత్వం వేలమంది ఆదివాసులు వందల ఎకరాలు జల సమాధి చేసేందుకు కార్పొరేట్ కంపెనీలకు సుమారు 8 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం అనుమతులు మంజూరు చేసిందని టూరిజం అభివృద్ధి పేరుతో 1/70 చట్టం సవరణ చేస్తామని,పెసా చట్టం,అటవీ హక్కుల చట్టం ఉల్లంఘిస్తూ ఖనిజా సంపద,సహజ వనరులు అదానీ అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసులకు జీఓ నెంబర్-3 నూరు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 కేబినెట్ సమావేశాలు నిర్వహించారని కనీసం ఆ దిశగా చర్చించలేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని ఆదివాసీలకు స్పెషల్ డీఎస్సీ నోటిపికేషన్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని ఆదివాసీ ప్రాంతాల్లో ఫారెస్టు అనుమతుల పేరుతో వందల రోడ్లు ఆపేశారని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆగిన రోడ్లు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బురిడీ కొండ, పూజారి సద్దు, కిల్లో సోనబాబు,గొల్లూరి బస్వా గ్రామ యువకులు మోస్య నాగేశ్వరావు, పూజారి దూత్, బలరాం, మాజీ వార్డుసభ్యులు అచ్చమ్మ,మోత్తి,రోహిల, కలిమా, రంభ, ఇరమ్మ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

134th Jayanti Sabha in

You cannot copy content of this page

Scroll to Top