Jan Vigyan Vedika : గిరిజనులు మూఢనమ్మకాలను వీడనాడాలి

TRINETHRAM NEWS

జన విజ్ఞాన వేదిక, ఆదివాసీ గిరిజన సంఘం.

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 27: సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ప్రజలు మూఢనమ్మకాలను వీడనాడాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు త్రిమూర్తులు రెడ్డి ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి పొద్దు బాలదేవ్ అనంతగిరి ఎస్ ఐ డి శ్రీనివాస్ అన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రిగూడ గ్రామానికి చెందిన ఎడారి డోంబు సజీవ దానం గురి అయిన నేపథ్యంలో పోలీసుల సహకారంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో లోతేరులో సందర్శించి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు.మూఢనమ్మకాలు పై జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు శ్రీరాములు గిరిజన ప్రాంతంలో జరుగుతున్న మూఢనమ్మకాలపై మోసాలపై వివిధ రకాల మ్యాజిక్ షో ద్వారా గిరిజనులు,విద్యార్థులకు చైతన్యం పరిచారు.సైన్స్ ను నమ్మాలని మూఢనమ్మకాలను వీడాలని ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంటామని తెలిపారు.

గిరిజనులు ఎవరికైనా అనారోగ్యం బాగో లేనప్పుడు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ను చూపించుకోవాలని అప్పుడే జబ్బు నయమవుతాయని తెలిపారు.మూఢనమ్మకాలు నమ్మి గురువులను, పూజలు దగ్గర వెళ్లి వాళ్ళు చెప్పే మాయమాటలకు నమ్మి మోసపోవద్దన్నారు. పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు.ఇంటి పక్కనే మేకలు,ఆవులు,పందులు పెంచడం పరిశుభ్రత పాటించకపోవడంతో మలేరియా, డయేరియా,జ్వరాలు వంటి అనేక జబ్బులు బారిన పడి మూడ నమ్మకాలు నమ్మి గురువులను సంప్రదిస్తుంటారని జబ్బు తగ్గకపోతే ఆసుపత్రికి తీసుకెళ్తుంటారని చెప్పారు.

అరకులోయ మండలంలోని లోతేరు పంచాయితి,డుంబ్రిగుడ గ్రామంలో మూడ నమ్మకాలు నమ్మి చేతబడి చేస్తున్నాడని అడారి డోంబు ను పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన వ్యక్తులకు సుమారు 20 ఏళ్లు వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పారు.గ్రామంలో ఈ మద్య కాలంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.సోయిత కు ఆరోగ్యం భాగలేక తగ్గక పోవడంతో విషం తాగి చనిపోయిందని విచారణలో తేలిందన్నారు.మరోవ్యక్తి అనారోగ్యం బాగోలేక విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.దానికి కారణం చేతబడి చేశారని అనుమానంతో ముకుమూడిగా గ్రామస్తులు దాడి చేసి పెట్రోల్ పోసి సజీవ దానం చేసినట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. గ్రామంలోసెల్ సిగ్నల్ ఉన్నప్పటికీ ఎవరు కూడా పోలీసులకు గాను గ్రామ పెద్దలకు సమాచారం అందించలేదని ,సమాచారం అందించి ఉంటే ప్రాణం ఉండేదని అన్నారు.

మూఢనమ్మకాలు నమ్మకూడదని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చిన గ్రామ పెద్దలకు గాని సర్పంచ్ గాని పోలీస్ స్టేషన్లను వచ్చి సరిదిద్దుకోవాలని ఇటువంటి సంఘటనలకు పాల్పడ్డ వద్దని సూచించారు. మహిళ పోలీసులు సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామాల్లో మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి అవగాహన పరచాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుబాయ్ కళావతి, జన విజ్ఞాన వేదిక సభ్యుడు డిగ్రీ కళాశాల ఉపాధ్యాయుడు డాక్టర్ శోభన్ బోడ్నాయిక్, పాస్టర్ ఇసాక్, పెసా కమిటీ ఉపాధ్యక్షుడు కిల్లో రామన్న, విఆర్ఓ నాగేశ్వరరావు, అగ్రికల్చర్ అసిస్టెంట్ తాతా బాబు, మహిళ పోలీసులు,పోలీస్ సిబ్బంది, గిరిజనులు విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tribals should give up

You cannot copy content of this page

Scroll to Top