Tragedy at Srinidhi University : శ్రీనిధి యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం

TRINETHRAM NEWS

Trinethram News : Feb 13, 2026, మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని శ్రీనిధి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్‌కు చెందిన ఏఐ, ఏంఎల్ మొదటి సంవత్సరం విద్యార్థి గంట కళ్యాణ్ (18) కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కళ్యాణ్ తరచూ కళాశాలకు రావడం లేదని, మాట వినడం లేదని యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కౌన్సిలింగ్ కోసం పిలిచినట్లు తెలిసింది. విద్యార్థి మేనమామ కళాశాల యాజమాన్యంతో మాట్లాడుతుండగా, వాష్‌రూమ్‌కు వెళ్తానని చెప్పి రెండో అంతస్తు నుండి దూకేశాడు.

విద్యార్థిని వెంటనే అన్నోజీగూడలోని నీలిమ ఆసుపత్రికి తరలించగా, అతనికి కాళ్లు, వెన్నెముక భాగంలో తీవ్రమైన ఫ్రాక్చర్లు అయినట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tragedy at Srinidhi University Engineering College

You cannot copy content of this page

Scroll to Top