Intermediate Hall Tickets : నేడు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

TRINETHRAM NEWS

Trinethram News : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.  ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి రంజిత్‌బాషా తెలిపారు. విద్యార్థులు https://bie.ap.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా హాల్‌టికెట్లు పొందొచ్చన్నారు.

మొదటి సంవత్సరం వారు పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబరు, ద్వితీయ సంవత్సరం వారు మొదటి సంవత్సరం హాల్‌ టికెట్‌ నంబరు లేదా ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

మనమిత్ర వాట్సప్‌ నంబరు 955230 0009కు హాయ్‌ అని మెసేజ్‌ పెట్టి, హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. హాల్‌ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్, కళాశాల స్టాంప్‌ అవసరం లేదని తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Intermediate exam hall tickets released today

You cannot copy content of this page

Scroll to Top