
ట్రాఫిక్ ఆంక్షలు
తేదీ : 02/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ సమీపంలో ఉన్న కొండపల్లి ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ యస్. ఐ లక్ష్మణరావు కొండపల్లి బ్యాంకు సెంటర్లో షాపుల వ్యాపారస్తులకు, ఆటో డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు రోడ్ల పైన వాహనాలు పార్కింగ్ చేయకూడదని సూచించడం జరిగింది.
షాపుల ముందు నిబంధనలు పాటించాలి అంటూ మునిపెన్నడు లేనివిధంగా కొండపల్లిలో స్థానికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎవరితోనూ దురుసు ప్రవర్తన లేకుండా అందరితో కలిసి ,ప్రజలతో మమేకమై కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుండాలి అంటూ ప్రజలకు వివరించడం జరిగింది. యస్. ఐ మాట తీరు బాగుంది అంటూ వ్యాపారస్తులు , వాహనదారులు పొగిడారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
