Collector Kritika Shukla : రేపు జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం గ్రామ సభలు

TRINETHRAM NEWS

Trinethram News : నరసరావు పేట:రేపు జిల్లా వ్యాప్తంగా 347 రైతు సేవా కేంద్రాల వద్ద రైతన్న మీకోసం గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం జిల్లా వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెబెక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రైతన్న మీకోసం గ్రామ సభలలో 2025-26 రబీ, 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్ ల పంట ప్రణాళికలపై రైతులతో చర్చించాలన్నారు.రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాల ( నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు అనే ఐదు సూత్రాలు) ఆధారంగా పంట ప్రణాళిక తయారీలో అధికారులు, రైతులు భాగస్వాములు కావాలన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tomorrow, Gram Sabhas for Farmers across the district

You cannot copy content of this page

Scroll to Top