Trinethram News : పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రక్రియలో కీలకమైన సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే.
జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్లు పంచాయతీరాజ్శాఖ కమిషనరేట్‌కు సోమవారం మధ్యాహ్నమే చేరుకున్నాయి. 31 జిల్లాల నుంచి మూడుసెట్ల గెజిట్లు జిరాక్స్ కాపీలతోపాటు పెన్డ్రైవ్‌లో తీసుకుని కమిషనరేట్లలోని హెల్ప్‌డెస్క్‌లో డీపీవో (DPO)లు అందజేశారు. వాటిని పంచాయతీ రాజ్ అధికారులు పరిశీలించి, ఆ తర్వాత జిల్లాల వారీగా ఒక్కో సెట్ గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి (State Election Commission) హ్యాండోవర్ చేశారు. అదేవిధంగా మరో గెజిట్ కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు (CS Rama Krishna Rao) పంపారు.
ఈ క్రమంలో ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఏసీ గాడ్స్‌లో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సాయంత్రం 6.15కు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లుగా మీడియాకు సమాచారం అందింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


