Miss World : నేడే 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే.. ఫైనలిస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : 72వ ప్రపంచ సుందరి టైటిల్ ఎవరు గెలుచుకుంటారోనని.. మొత్తం వరల్డ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అలాంటి పోటీలకు హైదరాబాద్ మొట్టమొదటిసారి వేదికగా నిలిచింది. తెలంగాణలో దాదాపు నెలరోజులు ట్రెడీషనల్ పోటీలు ఎదుర్కొన్న 108 మంది మిస్ వరల్డ్ పోటీదారులు.. చివరి ఘట్టానికి చేరుకున్నారు. 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో తమ దేశాన్ని రిప్రెజెంట్ చేస్తూ టైటిల్ గెలుచుకునేందుకు ఎదురు చూస్తున్నారు.

మిస్ వరల్డ్ ఫెస్టివల్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ను ఈరోజు అంటే మే 31వ తేదీన మధ్యాహ్నం 1:00 GMT (6:30 PM IST)కి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఈ ఈవెంట్పై ఉండడంతో దీనిని లైవ్ కూడా అందిస్తున్నారు. అందం, ఐక్యతే ప్రధాన లక్ష్యంగా పోటీ పడుతున్న ఈ వేడుకల్లో మిస్ వరల్డ్ కిరీటం ఎవరు దక్కించుకుంటారో చూడాలి..

ఈ కార్యక్రమాన్ని ఇండియాలో చూడాలనుకునేవారు SonyLivలో లైవ్లో చూడొచ్చు. ఎంపికైన దేశాలు.. నేషనల్ మీడియాలో ఈ టెలికాస్ట్ను చూడొచ్చు. లేదంటే www.watchmissworld.com వెబ్సైట్లో హై డెఫినిషనల్లో చూడొచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today is the 72nd

You cannot copy content of this page

Scroll to Top