జూలై 7, 2026

WhatsApp Image 2024 02 01 at 9.26.58 PM

TRINETHRAM NEWS

తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి, దేశానికి ఆదర్శంగా నిలిపిన బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ బిఆర్ఎస్ అధినేత చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు.

గురువారం గజ్వేల్ ఎమ్మెల్యే గా అసెంబ్లీ లో ప్రమాణస్వీకారం అనంతరం నంది నగర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ముఖ్య నేతలతో ముగిసిన కేసీఆర్‌ సమావేశం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండండి. ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వండి. అదికూడా మంత్రులు జనం మధ్యలో ఉన్నప్పుడే ఇవ్వండి.

You cannot copy content of this page