ఆత్మ బలిదానాలు వద్దు ఓటు ద్వారా పోరాడి సాధించుకుందాం
త్రినేత్రం ప్రతినిధి. టిజేఏసీ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో…. బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్స్ కల్పించాలని ఆత్మార్పణ చేసుకున్న సాయి ఈశ్వర్ చారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పరిగి మున్సిపల్ లోని అమరవీరుల చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సాయి ఈశ్వర చారి బలిదానమే తొలి చివరి బలిదానం కావాలని ఈ బలిదానం ప్రభుత్వ హత్యగా పరిగణించాల్సి ఉంటుందని కామారెడ్డి డిక్లరేషన్ లో విద్యా ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తానన్న ప్రభుత్వం ఆరు నెలల్లో అమలు చేయాల్సింది ఇప్పటివరకు చేయకపోగా గత ఎన్నికల్లో ఇచ్చిన రిజర్వేషన్ కంటే తగ్గిస్తూ ఎన్నికలకు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణలో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ సాయి ఈశ్వరచారి ఆత్మకు శాంతి కలగాలని ఇటువంటి బలిదానాలు ఎవరూ చేసుకోవద్దని ఓటు ద్వారా రాజ్యాంగబద్ధ హక్కులను సాధించుకోవడానికి పోరాటాల ద్వారా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు ఉద్యమకారులు మాజీ పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ముకుంద నాగేశ్వర్ తాహిర్ అలీ, కృష్ణ, ఆంజనేయులు, నారాయణ, రవి, శ్రీనివాస్, శ్రీశైలం, లింగమయ్య, ప్రవీణ్ రెడ్డి రవికుమార్, బలాల, హాజీ పటేల్, పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


