పత్రిక ప్రకటన 03.01.2025
ఖనిలో ఘనంగా టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షుడు జన్మదిన వేడుకలు…
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని టి ఎన్ టి యు సి కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి టిఎన్టియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు అధ్యక్షతన శుక్రవారం టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు ఎం కె బోస్ 78వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. వారు మాట్లాడుతూ, కార్మికుల పక్షాన పనిచేస్తూ, ఎన్నో హక్కులు సాధించడంలో కార్మిక పక్షపాతిగా కార్మిక నాయకుడిగా పనిచేస్తున్నారని, భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో భగవంతుడి ఆశీస్సులతో కార్మికుల హక్కుల సాధనలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సల్ల రవీందర్, గుండబోయిన ఓదెలు, చిటికెల రాజలింగు, నరెడ్డి స్వరాజ్యం, ఖుషి నర్మద, బిక్కం వీరేందర్, కామెర రాజబాబు, సుందిళ్ల స్వామి, వేల్పుగొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App