WhatsApp Image 2023 12 25 at 5.14.09 AM
మార్చి నెలకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టికెట్స్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టికెట్లు) డిసెంబర్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది.
అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ ప్రారంభం అవుతుందని తెలిపింది. అటు నిన్న మార్చి నెలకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే.
