టైరు పేలి మరో కారును ఢీకొన్న కారు.. చిన్నారి సహా ముగ్గురి మృతి

TRINETHRAM NEWS

East Godavari: టైరు పేలి మరో కారును ఢీకొన్న కారు.. చిన్నారి సహా ముగ్గురి మృతి

దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు..

కారు టైరు పేలి డివైడర్‌ అవతలి వైపు వెళ్తోన్న మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో వెళ్తోన్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆస్పత్రులకు తరలించారు..

You cannot copy content of this page

Scroll to Top