TRINETHRAM NEWS

ముంబయి: రైలు దూసుకురావడంతో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి మహారాష్ట్ర లో చోటు చేసుకొంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పాల్ఘర్‌ జిల్లాలో సిగ్నల్‌ సమస్య తలెత్తడంతో వాటిని బాగుచేసేందుకు పశ్చిమ రైల్వే విభాగానికి చెందిన ముగ్గురు సిబ్బంది వెళ్లారు. రాత్రి వేళ పని జరుగుతుండగా పట్టాలపై ఉన్న సిబ్బంది సమీపిస్తున్న రైలును గమనించలేదు. రైలు వారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతులను సిగ్నలింగ్ ఇన్‌స్పెక్టర్‌ వాసు మిత్ర, నిర్వాహకుడు సోమనాథ్‌ ఉత్తమ్‌, సహాయకుడు సచిన్ వాంఖడేగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ. 55 వేల పరిహారాన్ని అందించినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.